కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు తలనొప్పులు తగ్గటం లేదు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా మరో మంత్రి కృష్ణ బేరె గౌడ అలకబూనారు. గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖలో కీలక విభాగాలను డీకే వద్దే ఉంచుకోవడంపై కినుకు వహిస్తూ ఇప్పటి వరకు ఆయన మంత్రిగా బాధ్యతలను స్వీకరించలేదు. శాఖలపై మంత్రి ఢిల్లీ పెద్దలను కలవనున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
డీకేకు తగ్గని తలనొప్పులు.. మరో మంత్రి అలక


