హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,470 పెరిగి రూ.1,53,160కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,350 పెరిగి రూ.1,40,400 ఉంది. దాదాపు 10 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. అటు కిలో వెండి ధర రూ.2,70,000 ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: పెరిగిన బంగారం ధరలు


