హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎల్ నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి'

SDPT: ఖరీఫ్ సీజన్‌లో ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి సూచించారు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాల మధ్య విరామాలు పెరిగే అవకాశం ఉన్నందున నీటి సంరక్షణ, వాతావరణానికి అనుకూల పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు.