హైదరాబాద్: 28°C
వార్తలు

జామాయిల్ చెట్టు నరికివేత.. స్థానికుల మండిపాటు

NLR: వరికుంటపాడు (M) కాకులవారిపల్లి సమీపంలోని రామపురం బీట్ పరిధి అటవీ భూముల్లో జామాయిల్ చెట్టును అక్రమంగా నరికేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ. లక్షలు విలువైన అటవీ సంపదను కొంతమంది అక్రమార్కులు తరలిస్తున్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు రూ.5 లక్షలకు పైగా విలువైన కలప తరలించినట్లు సమాచారం.