కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తనిఖీల కోసం శబరిమల ఆలయ ప్రభమండలం నుంచి మరిన్ని బంగారు తాపడం రేకులను తొలగించేందుకు అనుమతినిచ్చింది. తలుపు పై భాగంలోని రేకులను కూడా కొన్నింటిని తొలగించి శాస్త్రీయ విశ్లేషణకు పంపించాలని వెల్లడించింది. బంగారం చోరీ కేసులో పురోగతిని వివరిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
వార్తలు
శబరిమల కేసు.. హైకోర్టు కీలక తీర్పు


