NRML: కుంటాల మండల కేంద్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపించాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముదామనుకున్న రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు తమ గోడును విన్నవిస్తున్నారు.
వార్తలు
భారీ వర్షంతో నీటిమయమైన కొనుగోలు కేంద్రాలు


