SRPT: బెజ్జంకి మండలం వడ్లూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో దోపిడీ జరిగి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చేపట్టిన విచారణలో ఫిర్యాదు తప్పు అని తేలింది. గతంలో విక్రయించిన ఆభరణాల విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉంచేందుకే దోపిడీ కథనం సృష్టించినట్లు వెల్లడైంది. ఆ మహిళపై ఎస్సై తిరుపతి కేసు నమోదు చేశారు.
వార్తలు
దోపిడీ కథనం కల్పితం.. మహిళపై కేసు నమోదు


