హైదరాబాద్: 28°C
వార్తలు

రెబల్ ఎంపీలకు టీఎంసీ ఎంపీ సవాల్

టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు NDA కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించడంపై ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఈ ఎంపీలంగా 2024 ఎన్నికల్లో టీఎంసీ టికెట్‌పై గెలిచారని.. ప్రజా తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిందని గుర్తు చేశారు. దమ్ముంటే వీరందరూ తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని సవాల్ విసిరారు.