హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఎంపీ శబరి సంతాపం

NDL: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఆ కుటుంబాలకు ప్రసాదించాలని కోరారు.