హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

క్యారెట్, పుదీనా పానీయంతో కలిగే లాభాలు

క్యారెట్, పుదీనా కలిపి తయారు చేసిన పానీయం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణక్రియను సక్రమంగా ఉంచి, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా కడుపులోని సమస్యలను తగ్గిస్తుంది. క్యారెట్‌లోని ఫైబర్, పుదీనాతో కలిసి ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.