హైదరాబాద్: 28°C
వార్తలు

కాకినాడ జిల్లాకు 50 ఎలక్ట్రికల్ బస్సులు

KKD: జిల్లాకు త్వరలో 50 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని ఇంఛార్జ్ జిల్లా రవాణా అధికారి మనోహర్ తెలిపారు. వీటి కోసం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లోని 2.79 ఎకరాల స్థలంలో గ్యారేజ్, ఎనర్జీ రూమ్, వాషింగ్ ప్లాంట్, విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. బస్సులు రాకముందే ఈ మౌలిక వసతుల పనులను పూర్తి చేస్తున్నామన్నారు.