హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదోనిలో స్కూటీ డిక్కీ కింద పాము కలకలం

KRNL: ఆదోనిలోని మెయిన్ రోడ్డులో సోమవారం ఓ వ్యక్తి స్కూటీ సీటు కింద పాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. షాపులో కొనుగోలు చేసిన వస్తువులను డిక్కీలో పెట్టేందుకు సీటు తెరవగా పాము కనిపించింది. వెంటనే అప్రమత్తమైన అతను.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడంతో స్కూటీ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు.