హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ ఉద్యోగ మిత్ర వెబ్ పోర్టల్ ఆవిష్కరణ

సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర వెబ్ పోర్టల్ ను సీపీ రష్మీ పెరుమాళ్ అధికారులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీల మధ్య ఈ పోర్టల్ ఒక సమర్థవంతమైన వారధిగా ఉపయోగపడుతుందని తెలిపారు. https:www .siddipetpoliceudyogamithra.com ద్వారా పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు.