NLR: ఉదయగిరి పట్టణం బీసీ కాలనీ సమీపంలో వెలసిన శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకుని అర్చకులు నిర్వహించే విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అలంకరణలను తిలకించి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.