NLR: పురుషులతో పాటు మహిళలు కూడా ఆర్థిక స్వావలంబనసాధించే దిశగా పొదుపు మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని గూడూరు మెప్మా సీఎంఎం కవిత పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ మెప్మా కార్యాలయ ఆవరణంలో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఋణాలను పొంది స్వయం సహాయక సంఘాలు, మహిళలు నిర్వహిస్తున్న వ్యాపార ఉత్పత్తులను ప్రదర్శిస్తూ అర్బన్ మెప్మా బజారును నిర్వహించాలన్నారు.