GNTR: ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులైన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్యను ఆత్మకూరు గ్రామ టీడీపీ నాయకులు శుక్రవారం కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు వెంకట్రావు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ నాయకులు పాల్గొన్నారు.