ASR: డుంబ్రిగుడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద ఆదివారం పర్యటకులు సందడి చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం దేశ నలుమూలల నుండి చాపరాయి అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాపరాయి వద్ద ఉన్న గార్డెన్ వద్ద పర్యటకులు సరదాగా గడిపారు, అలాగే దింసా నృత్యంలో పాల్గొని సందడి చేశారు.