ASR: ఐటీడీఏ పీవో అభిషేక్ చొరవతో గంతలతో ఉండే అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే రహదారికి మోక్షం కలిగింది. వర్షాలు పడితే ఈ రహదారిలో ఉన్న గుంతలులో నీరు చేరి చెరువును తలపించేది. దీంతో ఐటీడీఏ పీవో ప్రత్యేక దృష్టి పెట్టి ఉపాధి హామీ నిధుల నుండి రూ.65 లక్షలతో సీసీ రోడ్డు, వర్షపు నీరు పోవడానికి కాలువ నిర్మాణంకు నిధులు మంజూరు చేశారు.