వైఎస్ వివేకా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. సునీతకు, వివేకా రెండో భార్యకు మధ్య వివాదాలున్నాయని గుర్తు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మార్పులు తిరుగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఆయన తనయుడు, ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టవుతారనే వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ భయంతో బెయిల్ పిటిషన్ వేశారు.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
ఏపీలోని పల్నాడు(palnadu) పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో 8వ తరగతి విద్యార్థి కోటిస్వాములు మృతి చెందాడు. రాత్రి భోజనం(Supper) చేశాక ఊపిరాడటం లేదని విద్యార్థి కోటిస్వాములు ఫ్రెండ్స్(Friends)కి చెప్పాడు. దీంతో హాస్టల్ వార్డెన్(Hostel warden) కోటిస్వాములను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కోటిస్వాములు చనిపోయాడు.
అన్నమయ్య జిల్లా(Annamaya District)లో అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ (Kothapally Cross Road)వద్ద ఈ ఘటన జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా సంచలనం రేపుతోన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఆదివారం సంచలన పరిణామం జరిగింది. వైఎస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)ని సీబీఐ అరెస్ట్ చేసింది. కీలక సూత్రధారిగా ఆయనను సీబీఐ గుర్తించింది. గతంలో పలుమార్లు భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు (CBI notices) జారీ చేసి ప్రశ్నించింది.
ఇకపై ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
మెగా బ్రదర్ నాగబాబు(Naga babu)కి జనసేనలో కీలక పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ విజయం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏకమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) పేర్కొన్నారు. ఈ క్రమంలో 8.5 కోట్ల మంది ప్రజలు నెలకు రూ.100 విరాళంగా ఇస్తే రూ.850 కోట్లు సేకరించవచ్చని స్పష్టం చేశారు. అలా ఓ నాలుగు నెలల పంపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) మనకే సొంతం అవుతుందన్నారు.