టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఏపీ సీఎం జగన్(CM Jagan) పై సంచలన ఆరోపణలు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని నిమ్మల ఆరోపించారు.
విజయవాడ శివారులోని కానూరులో మాజీ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్, బాలకృష్ణతో పాటు చంద్రబాబు నాయుడు హాజరవగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. రజనీ కామెంట్లను ఏపీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.
దాడికి నిరసనగా కుప్పంలో ఆందోళన చేస్తుండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తెలుగు తమ్ముళ్లపై విచక్షణరహితంగా కొట్టారు. పిడిగుద్దులు గుద్దుతూ.. గోడకేసి కొడుతూ బీభత్సం సృష్టించారు.
పోలీసులు వాహనాలను నిలిపివేయలేదు. ప్రకాశం బ్యారేజ్ పైకి రాగానే ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు దూసుకొచ్చాయి. ఇక కెనాల్ రోడ్డు వంతెన పైన కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బందర్ రోడ్డులో కూడా వాహనాలు వీరి కాన్వాయ్ మధ్యలోకి ప్రైవేటు వాహనాలు దూసుకొచ్చాయి.
ఎమ్మిగనూరు (Emmiganur) నియోజకవర్గం ఇబ్రహీంపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను లోకేశ్ పరామర్శించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని లోకేశ్ వద్ద మిర్చి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం పంట నష్టం అంచనా వెయ్యడానికి కూడా ఎవరూ రాలేదని రైతులు వాపోయారు.
ఏపీలో వేసవి సెలవు(Summer Holidays)ల్లో ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
హీరోగా నా తొలి సినిమా పేరు 'భైరవి' అని రజనీకాంత్ (Rajinikanth) గుర్తుచేశారు. పాతాళభైరవి సినిమా గుర్తుకొచ్చి హీరో పాత్రకు ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ దుర్యోదనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రభావం తనపై చాలా ఉందని, గద పట్టుకుని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడినని తెలిపారు