SKLM: ఎచ్చెర్లలోని ఐఐఐటీలో గుంటూరుకు చెందిన విద్యార్థి సృజన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం కళాశాల క్యాంపస్‌ను సందర్శించారు. విద్యార్థులను, కళాశాల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.