ELR: గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఆలయ అర్చకులు, వేద. పండితులు హనుమద్ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ హోమాన్ని ప్రతి ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈవో ఆర్వి చందన ఏర్పాట్లను పర్యవేక్షించారు.