VZM: గుంతలు లేని రోడ్ల కార్యక్రమంలో జిల్లాకు 176 రోడ్ల పనులు మంజూరయ్యాయి. రూ.23.51 కోట్లతో ఆర్ అండ్ బి శాఖ ఈ పనులు చేపడుతుంది. ఇందులో భాగంగా 750 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు జరగనున్నాయి. తొలి విడతలో 68 పనులకు రూ.10.54 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఇప్పటికే 61 పనులకు టెండర్లు ఖరారయ్యాయి. సంక్రాతికి పనులు పూర్తి కానున్నాయి.