PLD: సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి మాచర్లకు ఈ నెల 11, 12, 13 తేదీల్లో ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. MGBS నుంచి రాత్రి 11:20 బయలుదేరే ఈ సర్వీసు (నం.90704) తెల్లవారుజామున 3:30 మాచర్లకు చేరుకుంటుంది. టికెట్ రూ. 270గా నిర్ణయించారు. పండుగ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.