GNT: వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం సోమవారం సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కి హాజరుకావాలని గుంటూరు సిద్దార్థనగర్లోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఆదివారం నోటీసులు ఇచ్చారు.