VZM: పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారం రైతుల భూములలో నిర్వహించిన రహస్య సర్వేకు వ్యతిరేకంగా రైతులు సంఘటితమయ్యారు. రహస్య సర్వేని వ్యతిరేకిస్తూ ఎస్ఎంఎస్ కంపెనీ గేటు వద్ద 48 కుటుంబాలు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఆ భూమి మా జీవనాధారమని, తరతరాలుగా సాగు చేస్తున్నామని రైతుల అనుమతి లేకుండా ప్రైవేట్ సర్వే ఎలా చేపడతారని ప్రశ్నించారు.