KDP: ప్రొద్దుటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కలిసి, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. జీతాలు పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించడం, సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం వంటి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు.