ప్రకాశం: ఒంగోలు పరిధిలోని పేర్నమిట్ట ఏనుగుల బావి వద్ద పేకాట ఆడుతున్న 8మందిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో టాస్క్ఫోర్స్ పోలీసులు గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే చర్యలులో భాగంగా పేర్నమిట్ట వద్ద పేకాట ఆడుతున్న 8 మందితోపాటు రూ.4,500 వేల నగదును స్వాధీనం చేసుకొన్నారు.