W.G: రవాణా వాహనాలకు ఫిట్ నెస్ చార్జీల పెంపునకు నిరసనగా మంగళవారం తణుకులో ధర్నా నిర్వహించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రవాణా వాహనాలకు సంబంధించి ఫిట్ నెస్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తణుకు ప్రాంత రవాణా వాహన యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు. తణుకు నరేంద్ర సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.