PLD: నరసరావుపేట కేసనపల్లి రోడ్డులోని టిడ్కో (TIDCO) గృహాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.