VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజారోగ్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన వైద్యాధికారి డా.ఈ.ఎన్.వీ.నరేష్ నగరంలో వ్యాధుల పర్యవేక్షణ, పారిశుద్ధ్యం, కమ్యూనిటీ ఆరోగ్యం మెరుగుపరచడానికి అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. ప్రాంతాల వారీగా శుభ్రత తనిఖీలు పెంచాలని, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.