సత్యసాయి: సోమందేపల్లి మండలం గుడిపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మంత్రి సవితకు ఇవాళ వినతి పత్రం అందజేశారు. గుడిపల్లిలో రిజర్వాయర్ నిర్మిస్తే రైతులు నష్టపోతారని పెద్దన్న తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. రిజర్వాయర్ గుడిపల్లి పేరుతో ఉంటుంది తప్ప గుడిపల్లి గ్రామానికి, గుడికి, రైతుల భూములకు ఎటువంటి ఆటంకం ఉండదన్నారు.