VSP: జీవీఎంసీ వార్డుల పెంపు, విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని జనసేన మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. 98 వార్డులను 120కు పెంచుతూ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను రద్దు చేసి, ప్రజల అభిప్రాయాలు, ఎన్యుమరేషన్ బ్లాకుల ఆధారంగా కొత్తగా వార్డుల విభజన చేపట్టాలని కోరారు. అభ్యంతరాలు తెలిపేందుకు కేవలం వారం రోజుల గడువు ఇవ్వడం సరైంది కాదన్నారు.