PLD: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల శ్రీ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్మరణీయమైనదని తెలిపారు.