NLR: పొదలకూరులో విఘ్నేశ్వర దేవస్థానం భూమి, జిల్లా పరిషత్ పాఠశాల స్థలం ఆక్రమణకు గురవుతున్నాయంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దేవాలయ ప్రహరీని జేసీబీలతో కూల్చినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లిలో గుడులు, బడుల ఆస్తులకు భద్రత కరువు అయ్యిందని ఆయన తెలిపారు.