కృష్ణా: NH –216పై రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఘంటసాల పోలీసులు ప్రత్యేక చర్యలు శనివారం చేపట్టారు. మండల పరిధిలోని లంకపల్లి గ్రామ సమీపంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాన్ని ‘బ్లాక్ స్పాట్’గా గుర్తించారు. అక్కడ వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లు కలిగిన డ్రమ్ములను ఏర్పాటు చేశారు.