CTR: జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రభుత్వం మత్స్య సహకార సంఘాల సభ్యులకు చేప పిల్లలు, వలలు, బోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీఎం 40 శాతం రాయితీతో చేప పిల్లలను అందిస్తున్నారు. ఇప్పటికే సంఘాల నుంచి ప్రతిపాదనలు పంపాలని అధికారులు కోరుతున్నారు. చెరువులన్నీ నీటితో నిండుగా ఉన్నాయి.