కర్నూలులో వడ్డే ఓబన్న విగ్రహ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన వడ్డేర కుల సంఘం నాయకులు విగ్రహ నిర్మాణానికి సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డేర కుల సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీధర్, కృష్ణయ్య, టీజీ అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.