E.G: రూ.కోటి 80 లక్షలతో ఎనర్జీఎస్ నిధులతో కిర్లంపూడి మండలం వీరవరం గ్రామం నుంచి భూపాలపట్నం గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ ఉమాశంకర్తో కలిసి కిర్లంపూడి ఎంపీపీ తోట రవి పనులను పరిశించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు.