VSP: ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదండు ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం కూడలి వద్ద “తెలుగుతల్లికి నీరాజనం” కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ సంవత్సరమైనా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.