NDL: మహానంది మండలంలో పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు విక్రయాలను ప్రభుత్వం నిషేధించినట్లు శనివారం వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గాజులపల్లిలో పురుగుమందుల దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ప్రాణాలకు హానికరమైన ఈ మందును విక్రయించవద్దని డీలర్లకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.