KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక బాకరాపురం అక్షయ డాబా వద్ద జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను సోమవారం మున్సిపల్ కమిషనర్ రాముడు పరిశీలించారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా పైప్ లైన్ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆయన సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.