కృష్ణా: గుడివాడ సాల్వేషన్ ఆర్మీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు ‘శక్తి టీం’ నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థినులకు ‘శక్తి యాప్’ ఇన్స్టాలేషన్ ప్రయోజనాలను వివరించారు. సామాజిక మాధ్యమాల్లో (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్) వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు వార్డెన్‌కు చెప్పకుండా వెళ్లకూడదని తెలిపారు.