ప్రకాశం: రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు అన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు ఎస్సై కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు పాతనేర ప్రవృత్తిని విడనాడాలని, మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుంది.. మంచి మార్గంలో నడుచుకోవాలని సూచించారు.