ATP: అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ కుమార్ కుటుంబానికి ఆయన సహచర 2011 బ్యాచిమేట్లు మానవత్వం చాటుకున్నారు. వారు పోగు చేసిన రూ. 4,31,200 నగదును జిల్లా ఎస్పీ పి.జగదీష్ మంగళవారం మృతుడి భార్య మంజుకు అందజేశారు. ఈ సందర్భంగా సహచరుల ఐక్యతను, ఆర్థిక చేయూతను ఎస్పీ అభినందించారు.