KDP: పుల్లంపేట మండలంలోని తిరుమలయ్య గారపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జెండా ఉరుసు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదివింపులు చేసి, ప్రసాదాలను స్వీకరించారు.