ELR: దెందులూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా కామిరెడ్డి నానిని నియమిస్తూ పార్టీ అధిష్టానం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షులుగా బీ. స్వరూప్, ఈ.సురేష్ కుమార్, పీ. ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా సీ. శ్రీమన్నారాయణ, బీ. అర్జున్, సీ. ప్రేమ్ కుమార్, ఎన్. వెంకట్రామయ్య నియమితులయ్యారు. వీరితో పాటు పలువురు కార్యదర్శులను కూడా ఎంపిక చేశారు.