GNTR: ప్రధాన రహదారిపై పార్క్ చేసిన వాహనాలను 24 గంటల్లోగా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్పులి శ్రీనివాసులు వాహనదారులను కోరారు. నిర్ణీత గడువులోగా తొలగించని పక్షంలో ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో తొలగిస్తారని హెచ్చరించారు. ఈ నిబంధనలను అమలు చేసేందుకు ఇవాళ ఆయన ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని ఆయా ప్రాంతాలను పరిశీలించారు.