VZM: వీఆర్ఏలకు ప్రభుత్వం తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు వెంకన్న డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం వేపాడ తహసీల్దార్ రాములమ్మకు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ఈ నెల 5న జిల్లా కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నాలో పాల్గొంటామని పేర్కొన్నారు.