NDL: నంద్యాల జిల్లాలోని రంగాపురం శ్రీలక్ష్మీ మద్దిలేటి స్వామి దేవస్థానం శనివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.